
చైన్ స్నాచర్ల అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : ఇద్దరు చైన్ స్నాచర్ల అ రెస్ట్ చేసి వారి వద్ద నుంచి 27 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు మహబూబాబాద్ టౌన్ పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమవారం తొర్రూరు మండలం మాటేడుకు చెందిన ముత్యం ప్రేమలీలను కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును ఇద్దరు వ్యక్తులు లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే తొర్రూ రు పోలీసులు.. దంతాలపల్లి ఎస్సై రాజుకు విష యం తెలిపారు. ఎస్సై సూచన మేరకు బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు గణేశ్, లోకేశ్ వెంబడించి రామానుజపురానికి చెందిన మల్లం లింగయ్య సహకారంతో సూర్యాపేట జిల్లా మద్దిరాల పీఎస్ పరిధిలోని వేములపల్లి వైపునకు పారిపోయినట్లు తెలుసుకుని ఆ గ్రామస్తులు, సాయి, ఉదయ్, భిక్షపతికి సమాచారం చేరవేశారు. అంతలోనే తొర్రూరు, దంతాలపల్లి ఎస్సైలు ఉపేందర్ రావు, రాజు అక్కడికి చేరుకుని నేరం జరిగిన గంటలోనే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన చైన్‌స్నాచర్లు వికాస్ కుమార్, శుభంకుమార్‌ను అరెస్ట్ చేసి బంగారం, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో సహకరించిన ప్రజలను, తొర్రూరు సీఐ గణేశ్, ఎస్సైలు ఉపేందర్ రావు, రాజు, బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు గణేశ్, లోకేశ్‌ను ఎస్పీ అభినందించారు.
27 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్