
తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌కు ఏర్పాట్లు చేయాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 19, 20, 21 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు చేయాలని కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం అకడమిక్ కమిటీ హాల్‌లో సంబంధిత కమిటీల బాధ్యులతో నిర్వహించిన సమీక్షలో వీసీ మాట్లాడారు. సైన్స్‌కాంగ్రెస్‌కు హాజరు కాబోయే అతిథులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు ఉండాలన్నారు. వర్షాల నేపథ్యంలో కూడా అందుకనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. క్యాంపస్‌లోని పలు సెమినార్‌హాళ్లలో పేపర్ ప్రజెంటేషన్‌లు ఉన్న నేపథ్యంలో అక్కడ ఆధునిక సాంకేతిక పరికరాలను కూడా ఏర్పాటుచేయాలన్నారు.ఈ సమీక్షలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. వెంకట్రామ్‌రెడ్డి, ప్రొఫెసర్లు మల్లారెడ్డి, ఎన్. ప్రసాద్, స్వర్ణలత, డి. రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి