
జారుతోంది.. జర జాగ్రత్త
కొత్తగూడ: ఇటీవల కురుస్తున్న వర్షాలతో మండలంలోని కొత్తపల్లి సమీపంలో మట్టి రోడ్డు బురదమయంగా మారి గుంతలు పడ్డాయి. కాగా, బ్రిడ్జి నిర్మించి ఏడాది దాటిన అక్కడ తారురోడ్డు వేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డంతా బురదగా మారడంతో ద్విచక్రవాహనదారులు జారి పడుతున్నారు. ఇప్పటికై నా కాంట్రాక్టర్ స్పందించి కనీసం కంకర, డస్ట్ పోస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వాహనదారులు అంటున్నారు.
రుద్రతత్వమే విశ్వశక్తి
హన్మకొండ కల్చరల్: రుద్రతత్వమే విశ్వశక్తి అని, భగవంతుడి ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. శ్రావణమాసం మూడో సోమవారం ఉదయం రుద్రేశ్వరుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. సాయంత్రం సహస్రనామార్చనలు ప్రదోషకాలపూజలు భజనలు జరిగాయి. ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

జారుతోంది.. జర జాగ్రత్త