
కట్టుకాల్వలో పిచ్చి మొక్కల తొలగింపు
డోర్నకల్: మున్నేరువాగు నుంచి సీతారాంపు రం వరకు విస్తరించి ఉన్న కట్టుకాల్వ లో చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు పనులు జరుగుతున్నాయి. కాల్వలో చెట్లు, పిచ్చి మొక్కలు పేరుకుపోయి చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితులపై ఈనెల 4న ‘సాక్షి’ దినపత్రికలో ‘చివరికి నీరందేనా?’ అనే శీర్షికన వెలువడిన కథనంపై ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఈమేరకు సోమవారం కట్టుకాల్వలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెట్లు, చెత్తను తొలగించే పనులు చేపట్టారు. పనులను పరిశీలించిన రైతులు హర్షం వ్యక్తం చేశారు.
వైద్య కళాశాల
హాస్టల్స్ ప్రారంభించాలి
నెహ్రూసెంటర్: మానుకోట పట్టణంలోని వైద్య కళాశాల హాస్టళ్లను వెంటనే ప్రారంభించి, విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంధసిరి జ్యోతిబసు, పట్ల మధు డిమాండ్ చేశారు. సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. మెడికల్ కళాశాల ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావొస్తున్నా.. నిర్మాణాలు పూర్తయిన హాస్టల్ భవనాలను ప్రారంభించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే కలెక్టర్, ఎమ్మెల్యేలు స్పందించాలన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బానోత్ సింహాద్రి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బాషపాక పవన్, గుండ్ల రాకేశ్, నాయకులు మహేశ్, వినోద్, ప్రవీణ్, యాకన్న, ప్రమోద్, నరేశ్ పాల్గొన్నారు.
దాడిచేసిన వారిపై
కేసు నమోదు చేయాలి
మహబూబాబాద్ అర్బన్: నిర్మల్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేష్ నాయక్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఎస్టీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని శనిగపురం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ సమక్షంలో రాజేష్ నాయక్‌పై దాడి చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దుర్భాషలాడుతూ కులం పేరుతో అసభ్యపదజాలాన్ని ఉపయోగించిన మహేశ్వర్‌రెడ్డి అనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా డీఈఓపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. సమావేశంలో సంఘం నాయకులు నిలయ్య శ్రీనివాస్, వాసం నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్‌లో
నూతన బ్రేకర్లు ప్రారంభం
నెల్లికుదురు: మండల కేంద్రంలోని 11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతన బ్రేకర్లను ప్రాంభించినట్లు ఎన్పీడీసీఎల్ మహబూబాబాద్ ఎస్‌ఈ పి.విజేందర్‌రెడ్డి అన్నారు. సబ్‌స్టేషన్‌లో నైనాల నుంచి రావిరాల బ్రేకర్ మరమ్మతులు చేసినట్లు తెలిపారు. చిన్ననాగారం సబ్ స్టేషన్‌లో 11 కేవీ సీతారాపురం ఫీడర్‌ను వేరుచేసి నూతన బ్రేకర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందడంతో పాటు విద్యుత్ అంతరాయాలు తుగ్గుతాయన్నారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు రవి, చలపతిరావు, సింధూ, సిబ్బంది పాల్గొన్నారు.

కట్టుకాల్వలో పిచ్చి మొక్కల తొలగింపు

కట్టుకాల్వలో పిచ్చి మొక్కల తొలగింపు

కట్టుకాల్వలో పిచ్చి మొక్కల తొలగింపు

కట్టుకాల్వలో పిచ్చి మొక్కల తొలగింపు