
నెరవేరని హామీ..
వర్షం వస్తే భయం భయంగా..
వర్షం వస్తే భయం భయంగా..
వర్షం వస్తే భయం వేస్తుందని ముంపు గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాన కురిసిన రోజు రాత్రి జాగారం చేస్తున్నారు. ఆకేరు వాగు వరద ఎప్పుడు.. ఏ ప్రమాదం తెచ్చి పెడుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముంపు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.
మరిపెడ రూరల్: జిల్లాలో గత ఏడాది ఆగస్టు 31న అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆకే రు వాగు ఉప్పొంగి మరిపెడ మండలంలోని సీతా రాంతండా, ఉల్లెపల్లి, బాల్నిధర్మారం గ్రామాలను వరద చుట్టిముట్టింది. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఇళ్ల స్లాబ్‌లు ఎక్కారు. తెల్లవారుజామున అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేక బృందాలు వచ్చి ప్రజల ను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొద్దిరోజుల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించి మరోచోట ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయి తే సంవత్సరం కావొస్తున్నా.. హామీ నెరవేరకపోగా.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆయా గ్రామా ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
రూ.10 వేల ఆర్థికసాయం..
సుమారు 15 ఫీట్ల ఎత్తులో వచ్చిన ఆకేరు వాగు వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కట్టుబట్టలు, బి య్యంతో సహా అన్ని తడిసిముద్దయ్యాయి. ముంపునకు గురైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం కేవలం రూ.10 వేల ఆర్థిక సాయం అందించి చేతులు దులుపుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చే శారు. వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. బాధితులు వేడుకున్న విధంగా బ్యాంకు రుణాలు అందించలేదు. వారు కోరిన విధంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు.
తరలింపు లేనట్లేనా..
ఆకేరు వాగు వరద వచ్చిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి సీతారాంతండాను సందర్శించారు. ఈ సందర్భంగా ముంపు బాధిత కుటుంబాలను గుర్తించి అందరికీ సురక్షిత ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అయితే నేటికీ సీఎం హామీ నెరవేరలేదు.
గత ఏడాది ఆకేరు వాగు వరదలో చిక్కుకున్న గ్రామాలు
సీతారాంతండాను సందర్శించిన
సీఎం రేవంత్‌రెడ్డి
సురక్షిత ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల
నిర్మాణ హామీపై నీలినీడలు
రూ.10 వేల ఆర్థిక సాయం
మాత్రమే అందజేత
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో
భయాందోళనలో ముంపు బాధితులు