
రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ
మహబూబాబాద్ రూరల్: వరలక్ష్మీవ్రతం, రాఖీ, బోనాలు, తీజ్ వేడుకలకు సొంతూళ్లకు వచ్చిన ప్రజలు సెలవులు ముగియడంతో మళ్లీ హైదరాబాద్, వరంగల్ ఇతర పట్టణాల బాటపట్టారు. ఈమేరకు సోమవారం ప్రయాణికులు మానుకోట రైల్వే స్టేషన్ నుంచి ఆయా ప్రాంతాలకు తరలివెళ్లారు. కాగా వేలాదిమంది ప్రయాణికులతో రైల్వే స్టేషన్ సందడిగా మారింది. స్టేషన్‌లో రైళ్లను తక్కువ సమయం నిలపడంతో చాలా మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లలేకపోయారు. పలువురు ప్రయాణికులు తాము చేసుకున్న టికెట్ రిజర్వేషన్లను రద్దు చేసుకొని ఇతర మార్గాల ద్వారా వెళ్లారు.