
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన వినతులను వెంటనే పరిష్కరించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్‌టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వినతులను పరిష్కరించాలన్నారు. పరిష్కారం సాధ్యంకాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో 84 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నర్సింహస్వామి, జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, డీపీఓ హరిప్రసాద్, డీఏఓ విజయ నిర్మల, పశుసంవర్థక శాఖ అధికారి కిరణ్‌కుమార్, మెప్మా పీడీ విజయ తదితరులు పాల్గొన్నారు.
వచ్చిన వినతుల్లో కొన్ని..
● బయ్యారం మండలానికి చెందిన షబ్బీరుద్దీన్ మీసేవ కేంద్రం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని వినతి అందజేశాడు.
● డోర్నకల్ మండలం ఎర్రమట్టి తండాకు చెందిన జి.పద్మ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి అందజేసింది.
● కేసముద్రం మండలానికి చెందిన జాహెద తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేసింది.
ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో
ప్రజావాణిలో 84 అర్జీలు స్వీకరణ