
లాభసాటి పంటలు ఎంచుకోవాలి
ములుగు రూరల్: రైతులు లాభసాటి పంటలను ఎంచుకుని సాగు చేయాలని, అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని ఇంచర్ల శివారులో కేన్ బయో సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ధనసరి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆ యిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ సంచాలకుడు షేక్ యాస్మిన్ బాషా, కలెక్టర్ దివాకరతో కలిసి శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ గార్డెన్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. ములుగు జిల్లా పర్యాటక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ములుగు వ్యవసాయానికి అనువైన జిల్లా అన్నారు. ఆయిల్ పామ్ రైతుల కు మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో అ న్ని జిల్లాల్లో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ములు గు జిల్లాలో ప్రస్తుతం 5 వేల ఎకరాల్లో ఆయిల్ పా మ్ సాగవుతోందని, అది వచ్చే ఏడాదికి 10 వేల ఎకరాలు పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్ర భుత్వం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు బీసీ లకు 70 నుంచి 80 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 100 శా తం సబ్సిడీ అందిస్తుందన్నారు. మూడున్నర ఏళ్లలో పంట కోతకు వస్తుందన్నారు. ఆయిల్ పామ్ గింజ లు టన్ను రూ. 18 వేలు ఉందని, భవిష్యత్‌లో రూ. 25 వేలకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఆయిల్ పామ్ సాగుతో తక్కువ కష్టం..
అధిక రాబడి
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు తక్కువ కష్టం.. అధిక రాబడి ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆయిల్ పామ్ సాగుతో ప్రతీ ఏడాది రైతులకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు లాభం చేకూరుతుందన్నారు. జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళా సంఘాలకు విజయ డెయిరీ నుంచి గురుకులాలకు పాల సరఫరాకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. జిల్లాకు త్వరలో మరో ఐటీ కంపెనీ రాబోతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఉద్యాన శాఖ అధికారి సంజీవరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, కేఎన్ బయోసైన్స్ కంపెనీ ఎండి సుధారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క విమర్శించారు. ఈమేరకు సోమవారం ఆర్‌అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. బీజేపీ నాయకులు రామభక్తులు అయితే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ లిస్ట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అణచివేతను ఆయుధంగా చేసుకుని అరెస్ట్‌లు చేయిస్తోందన్నారు. ప్రజాతీర్పుకు విరుద్ధంగా బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆధారాలతో సహా బయటపడిందని చెప్పారు. బీజేపీ దుర్మార్గపు నిర్ణయాలను ప్రతీ గడపకు వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
ఆయిల్ పామ్ సాగుతో అధిక రాబడి
రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క

లాభసాటి పంటలు ఎంచుకోవాలి