ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ వర్క్‌షాప్‌లో కేయూ వీసీ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ వర్క్‌షాప్‌లో కేయూ వీసీ

Aug 12 2025 10:03 AM | Updated on Aug 13 2025 5:36 AM

కేయూ క్యాంపస్‌: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో సోమవారం నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ప్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ఒక రోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇందులో కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, కేయూ ఐక్యూఏసీ డైరెక్టర్‌ జి. షమిత, డాక్టర్‌ ఫణీంద్రకుమార్‌, బన్నూర్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్‌ సలహాదారు డాక్టర్‌ కె. వీరాంజనేయులు పవర్‌ పాయింట్‌ప్రజెంటేషన్‌ ద్వారా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో కొలమానం, విశ్లేషణ విధానాలు వివరించారని వీసీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వి. బాలకిష్టారెడ్డి నైపుణ్యాల అభివృద్ధికి అనుసరించాల్సిన కార్యాచరణను వివరించారు. తొలుత ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డి. రాజిరెడ్డి.. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు.

సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు అవసరం

కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం

కేయూ క్యాంపస్‌: సమాజానికి ఉపయోగపడే నాణ్యతాప్రమాణాలతో కూడిన పరిశోధనలు అవసరమని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం అన్నారు. హనుమకొండ యూనివర్సిటీ న్యాయ కళాశాలలోని పీహెచ్‌డీ స్కాలర్లకు సోమవారం నిర్వహించిన ఓరియెంటేషన్‌ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఓరియెంటేషన్‌ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను పరిశోధకులుగా మీ సిద్ధాంత గ్రంథాల్లో నాణ్యతాప్రమాణాలతో రూపొందించాలన్నారు. గౌరవ అతిథి, కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ గజ్జెల రామేశ్వరం మాట్లాడుతూ సానుకూల దృక్పథంతో ఆదర్శంతమైన పరిశోధకులుగా రాణించాలన్నారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌. సుదర్శన్‌ మాట్లాడుతూ ఈ ఓరియెంటేషన్‌ తరగతులు వారంరోజులపాటు వివిధ సబ్జెక్టు నిపుణలతో పరిశోధనల అంశాలపై నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ప్రభాకర్‌, శ్రీనివాస్‌, అధ్యాపకులు హరిప్రసాద్‌, సుజాత, వేదశ్రీ , లక్ష్మణ్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కోలా శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఓబీసీ ఫలితాల్లో భావన ప్రతిభ..

రాష్ట్ర స్థాయిలో తృతీయస్థానం

నర్సంపేట : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసి ఎమ్మెస్సీ ఓబీజీ ఫలితాల్లో నర్సంపేటకు చెందిన వైద్యాధికారి పొనుగంటి భావన ప్రతిభ కనబర్చి రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేటకు చెందిన మమత ఆస్పత్రి వైద్యులు భారతి, గోపాల్‌ దంపతుల కూతురు పొనుగంటి భావన హైదరాబాద్‌ నాగోల్‌లోని కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, రీసెర్చ్‌ సెంటర్‌లో ఎమ్మెస్సీ ఓబీజీ విద్యనభ్యసించారు. ఈ క్రమంలో ఇటీవల వెల్లడైన ఫలితాల్లో కామినేని మెడికల్‌ కళాశాలలో ఓవరాల్‌గా ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించారు. ఈ సందర్భంగా కామినేని వైద్య కళాశాల యాజమాన్యం భావనను మెమోంటో అందజేసి సన్మానించారు. కళాశాల ఎండీ వసుంధర, శశిధర్‌, కళాశాల సూపరింటెండెంట్‌ అజయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ పావని, అధ్యాపకులు, ఓబీజీ విద్యార్థులు, నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు బీఎం జయుడు, డాక్టర్‌ ఉదయ్‌సింగ్‌, డాక్టర్‌ రాజారాంతోపాటు పలువురు వైద్యులు, నర్సంపేట విద్యాసంస్థల అధినేతలు తదితరులు అభినందించారు. కాగా, ఈ సందర్భంగా భావనను తల్లిదండ్రులు గోపాల్‌, భారతి అభినందించారు.

చైన్‌స్నాచర్లకు దేహశుద్ధి

తొర్రూరు రూరల్‌: చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడి పారిపోతు న్న ఇద్దరు యువకులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశా రు. ఈ ఘటన సోమవారం తొర్రూరు మండలం మా టేడులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాటేడుకు చెందిన ముత్యం ప్రేమలీల రోడ్డు పక్క న నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ ప్రేమలీల మెడలోని పుస్తెలతాడును లాక్కొని పారిపోతుండగా బాధిత మహిళ కేకలు వేసింది. దీంతో స్థానికులు గమనించి ఆ యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులను వివరణ కోరగా ఆ యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ వర్క్‌షాప్‌లో కేయూ వీసీ
1
1/3

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ వర్క్‌షాప్‌లో కేయూ వీసీ

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ వర్క్‌షాప్‌లో కేయూ వీసీ
2
2/3

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ వర్క్‌షాప్‌లో కేయూ వీసీ

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ వర్క్‌షాప్‌లో కేయూ వీసీ
3
3/3

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ వర్క్‌షాప్‌లో కేయూ వీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement