ప్రాణం తీసిన మద్యం మత్తు.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మద్యం మత్తు..

Aug 12 2025 10:03 AM | Updated on Aug 13 2025 4:58 AM

ప్రాణ

ప్రాణం తీసిన మద్యం మత్తు..

ప్రభాకర్‌ హత్య ఘటనలో నిందితుడి అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు

మహబూబాబాద్‌ రూరల్‌ : మద్యం మత్తు మిత్రుడి ప్రాణం తీసింది. మహబూ బాబాద్‌ పట్టణంలోని లెని న్‌ నగర్‌ కాలనీకి చెందిన యువకుడు తూళ్ల ప్రభాకర్‌ ఈ నెల 3వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ ఎన్‌.తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. లెనిన్‌ నగర్‌ కాలనీకి చెందిన సంపతి శ్రీను, తూళ్ల ప్ర భాకర్‌ స్నేహితులు. ఈ నెల 3వ తేదీన రాత్రి ప్రభాకర్‌ మద్యం సేవిస్తు న్నాడు. ఎందుకు తాగుతున్నావని అప్పటికే మద్యం సేవించి ఉన్న శ్రీను అడిగాడు. ఈ క్రమంలో ప్రభాకర్‌ నువ్వేంది నాకు చెప్పేదని శ్రీనును అసభ్యకర పదజాలంతో దూషించాడు. ఫలితంగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రెకుడైన శ్రీను.. పక్కన ఉన్న కర్రతో తల, ముఖంపై కొట్టగానే ప్రభాకర్‌ తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయి కొంత సమయానికి మృతిచెందాడు. భయంతో శ్రీను అక్కడి నుంచి ఖమ్మం వెళ్లి అక్కడ మిల్లుల్లో పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో రైలులో మహబూబాబాద్‌ వచ్చి ఇంటికి వెళ్తుండగా పోలీసులు కనిపించారు. దీంతో భయంతో పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తూళ్ల ప్రభాకర్‌ను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో శ్రీనును అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు.

టీచర్లు కొడుతున్న విషయం చెప్పొద్దు..

అలా చేస్తే టీసీలు ఇచ్చి ఇంటికి పంపుతా..

విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఎస్‌ఓ

అధికారులు పట్టించుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు

బచ్చన్నపేట : విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటూ విద్యాబుద్దులు నేర్పించాల్సిన బాధ్యత గురువులదే. అయితే గురువులే ఇబ్బందులకు గురి చేస్తే ఆ విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి. టీచర్లు కొడుతున్న విషయం తల్లిదండ్రులకు చెప్పొద్దని, ఒకవేలా చెప్పితే టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తానని స్పెషలాఫీసర్‌(ఎస్‌ఓ) భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు విద్యార్థినులతోపాటు తల్లిదండ్రులు వాపోయారు. మండల కేంద్రంలోని కేజీబీవీ స్పెషలాఫీసర్‌ గీత విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు శుక్రవారం నిరసన తెలిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. రాఖీ పండుగ నిమిత్తం తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు గురువారం ఉదయం రాగా వారితో స్పెషలాఫీసర్‌ దురుసుగా ప్రవర్తించారు. గురువారం వస్తే శుక్రవారం ఉదయం రమ్మని తెలిపారు. దీంతో మరుసటి రోజు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఆగాలని తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశారు. తమ పిల్లలను టీచర్లు కొడుతున్నారని, ఆ విషయాన్ని తమకు చెప్పితే టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తానని విద్యార్థినులను స్పెషలాఫీసర్‌ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పాఠశాలలోకి అధికారులు, పాత్రికేయులు వెళ్లొద్దని, కేవలం మహిళలను మాత్రమే అనుమతిమస్తామని ఎస్‌ఓ చెప్పారన్నారు. విద్యార్థులను కొట్టి ఆస్పత్రికి తీసుకెళ్లిన విషయం ఇతరులకు తెలియకుండా చీకటి గదిలో బంధించిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. దీంతో విద్యార్థులు చదువుకోవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని, పాఠశాలకు వెళ్లమని మారాం చేస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు, కలెక్టర్‌.. పాఠశాలను తనిఖీ చేసి సదరు స్పెషలాఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై పాఠశాల స్పెషలాఫీసర్‌ గీతను వివరణ కోరగా రాఖీ పండుగకు తల్లిదండ్రులు కోరగానే విద్యార్థులను పంపించానని, కొట్టి చీకటి గదిలో బంధించానని పేర్కొనడంలో వాస్తవం లేదన్నారు. అనవసరంగా తమ పాఠశాలను బద్నాం చేస్తున్నారన్నారు.

ప్రాణం తీసిన మద్యం మత్తు..1
1/1

ప్రాణం తీసిన మద్యం మత్తు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement