
అరుణకీర్తిపతాకకు గజల్ కవి పురస్కారం
హన్మకొండ కల్చరల్ : హనుమకొండకు చెందిన గజల్ రచయిత్రీ, గాయని గంకిడి అరుణకీర్తిపతాకరెడ్డికి గజల్ కవి పుస్కారం అందజేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన గజల్ కవయిత్రీ విజయగోలి రాసిన మూడో గజల్ సంపుటి నవరాగిణి పుస్తకావిష్కరణ, తెలుగు గజల్ గాన విభావరి జరిగాయి. ఈ కార్యక్రమంలో అరుణకీర్తిపతాక పాల్గొని గజల్ వినిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అరుణకీర్తిపతాకను సన్మానించి పురస్కారం అందజేశారు.
రచనలతో సమాజంలో మార్పు
● మామునూరు పోలీస్ ట్రైనింగ్ కళాశాల డీఎస్పీ కూజా విజయ్‌కుమార్
హన్మకొండ కల్చరల్ : కవులు తమ రచనల ద్వారా సమాజంలో మార్పులు తీసుకొస్తారని, రాసే పదాలలో నిగూడార్థం దాగి ఉంటుందని మామునూరు పోలీస్ ట్రైనింగ్ కళాశాల డీఎస్పీ కూజా విజయ్‌కుమార్ అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలో కవయిత్రీ బాదం జయశ్రీ, వెంకటేశ్వర్లు దంపతుల షష్టిపూర్తి కార్యక్రమం జరిగింది. ఇదే సందర్భంలో జయశ్రీ రాసిన ‘మదిలో మెదిలిన మాటలు’ కవితాసంపుటి ఆవిష్కరణ జరిగింది. డీఎస్పీ కూజా విజయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. విశిష్ట అతిథి, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ కవితలు ప్రతీఒక్కరిని ఆలోచింపచేసేలా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా జయశ్రీ పుస్తకాన్ని తన భర్త వెంకటేశ్వర్లుకు అంకితమిచ్చారు. కార్యక్రమంలో సౌమ్మ, రాకేశ్, రెయాన్ష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

అరుణకీర్తిపతాకకు గజల్ కవి పురస్కారం