
జీజీహెచ్ భవనం పైనుంచి పడి రోగి మృతి
నెహ్రూసెంటర్ : ఓ రోగి ప్రమాదవశాత్తు మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన నాయిని ఐలయ్య (55) జ్వరంతో బాధపడుతూ ఈ నెల 7వ తేదీన జీజీహెచ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్ల వారుజామున చికిత్స పొందుతున్న వార్డు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఘటనపై వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య యాదమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.