
మరికొన్నిచోట్ల..
జిల్లాలో జంగాలపల్లి కూడలితోపాటు బండారుపల్లి రోడ్డు కూడలి వద్ద ‘ఐ లవ్ ములుగు’ అనే థీం ఏర్పాటు చేస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ తాడ్వాయి మండలం నార్లాపూర్–బయ్యక్కపేట కూడలి వద్ద సమ్మక్క–సారలమ్మ ప్రాచుర్యాన్ని తెలిపేలా కుంకుమ భరిణె థీంను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మేడారం జాతరలోగా కుంకుమ భరిణె థీంను నెలకొల్పి ఆసియాలోనే అతిపెద్ద జాతరకు వచ్చే భక్తులకు కనువిందు చేయనున్నారు. అదేవిధంగా తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం ఆర్చీ వద్ద ఆదివాసీ జీవన విధానం, వారి సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా ‘ఆదివాసీ బాణం సంధించే థీం’ ను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
విద్యుత్ కాంతుల్లో నంది విగ్రహం