● తాళ్లపూసపల్లిలో ఘటన
కేసముద్రం: కుటుంబ కలహాలతో ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తాళ్లపూసపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్‌రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వలసాని మురళి(39) కొంతకాలంగా మద్యానికి బానిసై భార్య రేణుకతో తరచూ గొడవ పడుతూ చనిపోతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో శనివారం మురళి భార్య రాఖీ పండుగ సందర్భంగా తన తల్లిగారింటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మురళి మద్యం తాగి మత్తులో చెరువుకట్టపై గడ్డిమందు తాగి పడిపోయాడు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళి అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి అన్న యాకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆదివారం తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో రేపాకలో వ్యక్తి..
రేగొండ: ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. ఈ ఘటన మండలంలోని రేపాకలో చోటు చేసుకుంది. ఎస్సై షాఖాన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సామర్ల బాబు (47) ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య అహల్య, ఇద్దరు కుమారులు రాజు, అజయ్ ఉన్నారు.