
సురేశ్‌కు జాతీయ పురస్కారం
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన నల్లగొండ సురేశ్ గిడుగు రామ్మూర్తి స్మారక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు భాషా దినోత్సవం జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ సీఈఓ ఉలవలపుడి వెంకటరత్నం, జాతీయ కమిటీ ప్రోగ్రాం డైరెక్టర్ ధనశి ఉషారాణి, భవాని సాహిత్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వైరాగ్యం ప్రభాకర్ చేతుల మీదుగా సురేశ్ పురస్కారం అందుకున్నారు. కాగా, సురేశ్ నవయుగ శతకం, దశధీరులు, కావ్య ఖండికతో పాటు అనేక పద్యాలు, రచనలు రాశారు. సురేశ్ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇడిపిలవంచ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా కొప్పూరు గ్రామస్తులు, సహ ఉపాధ్యాయులు.. సురేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.