
ఫైలేరియా నివారణకు మాత్రలు వేసుకోవాలి
గార్ల: ఫైలేరియా(బోదకాలు) నివారణకు రెండేళ్లు పైడిన వారందరూ విధిగా మాత్రలు వేసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. ఆదివారం గార్లలో ఫైలేరియా వ్యాధి నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు, వైద్యసిబ్బంది స్థానికంగా ఉంటూ విధుల్లో సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. దోమ కుట్టిన 3 లేదా 4 సంవత్సరాల తర్వాత వ్యాధి లక్షణాలు బయట పడతాయని సూచించారు. డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ మాట్లాడుతూ.. గత ఏడాది జిల్లాలో ఫైలేరియా వ్యాధి నివారణ మాత్రల పంపిణీ 64శాతం మాత్రమే నమోదైందని, ఈ ఏడాది 100శాతం నమోదయ్యేలా వైద్యులు, వైద్యసిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రజలకు సూచించారు. ప్రతీ ఒక్కరు విధిగా మాత్రలు వేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నోడల్ అధికారిరాజ్‌కుమార్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, డీసీహెచ్‌ఎస్ చింత రమేష్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రమీలారావు, జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి సుధీర్‌రెడ్డి, డీపీఓ హరిప్రసాద్, ఎంపీడీఓ మంగమ్మ, డాక్టర్ బాలునాయక్, పీహెస్‌సీ డాక్టర్ శివకుమార్, హెచ్‌ఎస్ ఇస్మాయిల్ బేగ్ పాల్గొన్నారు.
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య