
వినియోగదారుల ముంగిట్లో సేవలు..
కన్జ్యూమర్ గ్రీవెన్స్..
సెల్‌ఫోన్‌లో టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ ఓపెన్ చేసి అందులోని కన్జ్యూమర్ గ్రీవెన్స్ ఆప్షన్‌పై టచ్ చేయగానే న్యూ కాంప్లెంట్, కాంప్లెంట్ స్టేటస్, రీఓపెన్ కాంప్లెంట్, క్యాన్సల్ అనే ఫీచర్స్ కనిపిస్తాయి.
● న్యూ కంప్లైంట్: వినియోగదారుడికి సంబంధించిన సమస్యలను నేరుగా ఇందులో పొందుపరచొచ్చు. వారి మీటర్ నంబర్, సమస్య తాలూకు వివరాలు ఇందులో న మోదు చేస్తే ఆ సమస్యను పరిష్కరిస్తారు. విద్యుత్‌కు సంబంధించిన ప్రతీ అంశం పై ఫిర్యాదు చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది.
● కంప్లైంట్ స్టేటస్: ఫిర్యాదు చేసిన సమ స్య స్టేటస్‌ను ఇందులో చూసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా కార్యాలయం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే చూసుకునే అవకాశముంది.
● రీ–ఓపెన్ కంప్లైంట్: ఫిర్యాదు చేసిన సమస్యకు జరిగిన పరిష్కారంపై సంతృప్తి చెందక పోతే పునరావృతం చేసుకునే వీలుంది.
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం.. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినియోగదారుల ముంగిట్లోకే విద్యుత్ సేవలు తీసుకెళ్తుంది. ఫలితంగా మునుపెన్నడూ లేని విధంగా మెరుగైన, నాణ్యమైన సేవలు వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వినియోగదారుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతీ సమాచారం చేరుకునేలా డ్యాష్ బోర్డు రూపకల్పన చేశారు. అలాగే, టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా ఫిర్యాదులు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సంస్థ చేపడుతున్న పలు కార్యక్రమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
విద్యుత్ ప్రజావాణి..
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేకంగా విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతీ సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సెక్షన్, డివిజన్ కార్యాలయాల్లో, మఽ ద్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు సర్కిల్ కా ర్యాలయంలో విద్యుత్ వినియోగదారుల నుంచి వి నతులు, దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స మస్య తీవ్రతను బట్టి అప్పటికప్పుడే లేదా సమయం తీసుకొని పరిష్కరిస్తున్నారు.
ఎమర్జెన్సీ రిస్టోర్ టీమ్..
వినియోగదారులకు విద్యుత్ అంతరాయాలు తగ్గించడానికి, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చెప్పట్టడానికి ఎమర్జెన్సీ రీస్టోర్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతికంగా విద్యుత్ సమస్యలతో ఏర్పడే అంతరాయాలు తగ్గించడానికి, బ్రేక్ డౌన్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఈఆర్‌టీ వాహనాల ద్వారా జీపీఆర్‌ఎస్ లొకేషన్ ఆధారంగా వేగంగా వెళ్లి పరిష్కరిస్తారు.
పొలం బాట..
టీజీ ఎన్పీడీసీఎల్ రైతుల సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా ఎస్‌ఈ, డీఈ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు.
హెచ్‌టీ వినియోగదారులకు
సింగిల్ విండో వ్యవస్థ..
హెచ్‌టీ వినియోగదారులకు విద్యుత్ సర్వీస్‌ల మంజూరును సరళీకృతం చేస్తూ ఎన్పీడీసీఎల్‌లో సింగిల్ విండో వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. హెచ్‌టీ 11 కేవీ, 33 కేవీ ఓల్టేజీ సర్వీస్‌ల మంజూరును సింగిల్ విండో ద్వారా చేస్తున్నారు. సర్కిల్ కార్యాలయంలో ఏడీఈ కమర్షియల్ 11 కేవీ దరఖాస్తులను మానిటర్ చేస్తుండగా, ప్రధాన కార్యాలయంలోని ఏడీఈ 33 కేవీ, ఆపై ఓల్టేజీ దరఖాస్తులను మానిటర్ చేస్తారు.
అసెట్ మ్యాపింగ్..
అసెట్ మ్యాపింగ్‌లో భాగంగా అన్ని 33 కేవీ, 11 కే వీ విద్యుత్ స్తంభాలకు యూనిక్ ఫోల్ నంబర్ పె యింటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఆ పోల్ నంబర్ ద్వారా అక్కడి లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకుని వెంటనే చేరుకుని వేగంగా సమస్యను పరిష్కరించే అవకాశముంది. తద్వారా అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చు.
రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్..
టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌లోని రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ ఫీచర్ ఓపెన్ చేసి ఎక్కడైనా, ఎలాంటి ఘటన జ రిగిన ఇందులో జీపీఎస్ లొకేషన్ ద్వారా వినియోగదారుడు ఫొటో తీసి పంపొచ్చు. తద్వారా రిపోర్ట్ నేరుగా సంబంధిత అధికారికి వెళ్తుంది. వెంటనే ఆ అధికారి స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం..
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో
పలు కార్యక్రమాలు
రైతులకు తెలుగులో
సమాచారం
నూతన విద్యుత్ సర్వీస్ కోసం దరఖాస్తు చేసిన రైతులకు మంజూరుకు సంబంధించిన సమాచారం తెలుగులో అందిస్తున్నారు. ఎస్టిమేట్‌కు సంబంధించిన మెటీరియల్ తాలూకు వివరాలు, స్కెచ్ (నక్ష) వంటివి తెలుగులో అందిస్తున్నారు. రైతులకు ఎస్టిమేట్ కాపీలు తెలుగులో అందించడం ద్వారా సులభంగా అర్థమవుతాయి. ఈ వివరాలు రైతుల సెల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రూపేణ అందుతాయి.

వినియోగదారుల ముంగిట్లో సేవలు..