
నలుగురి బలవన్మరణం
వేర్వేరు కారణాలతో
రఘునాథపల్లి: అప్పు చెల్లించాలని బంధువుల ఒత్తిడితో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టులో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మేకలగట్టు గ్రామానికి చెందిన ముక్క ఎల్లయ్య (52)–రేణుకకు ఇద్దకు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఆరు నెలల క్రితం పెద్ద కూతురు వివాహం చేశారు. వివాహ సమయంలో ఫతేషాపూర్ గ్రామంలోని బంధువు గడ్డం మహేందర్ వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్నారు. మహేందర్.. ఎల్లయ్య కుమార్తె వివాహానికి వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బిడ్డ పెళ్లికి రావడంతోనే మహేందర్ మరణించాడని, ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని మేకలగట్టుకు చేరుకొని ఎల్లయ్యపై బంధువులు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఎల్లయ్య శుక్రవారం రాత్రి కిచెన్‌షెడ్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు శనివారం ఉదయం లేచి చూడగా చనిపోయి కనిపించాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు.
వివాహం కావడం లేదని
పానీష్‌తండాలో యువకుడు..
రాయపర్తి: తనకు వివాహం కావడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పానీష్‌తండాలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. తండాకు చెందిన కొర్ర బీమా, నాజీ దంపతుల పెద్ద కుమారుడు మోహన్(25) కొంతకాలంగా తనకు వివాహం కావడం లేదని మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యకుయత్నించాడు. గమనించిన కుటుంబీ కులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి భీమా ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని సీతానగరలో వ్యక్తి..
గూడూరు: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన శనివారం మండలంలోని సీతానగరం శివారు ఆకులబండతండా సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సీతానగరం గ్రామానికి చెందిన తాటి రాకేశ్ (45), రజిత దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వారికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో రాకేశ్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్యను మద్యానికి డబ్బులు అడగుతూ ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. రెండు రోజుల క్రితం డబ్బులు ఇవ్వనందుకు ఇంటి నుంచి కోపంతో వెళ్లాడు. ఈ క్రమంలోనే బావిలో దూకి ఉంటాడనే భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.
ఆర్థిక కారణాలతో మొగుళ్లపల్లిలో తాపీమేసీ్త్ర..
మొగుళ్లపల్లి: ఆర్థిక కారణాలతో ఓ తాపీమేసీ్త్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బండారి కొమురయ్య(54) తాపీమేసీ్త్రగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆర్థికపరంగా గొడవ జరగడంతో డబ్బులు తీసుకొస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. శనివారం మొగుళ్లపల్లి శివారులో గొర్రెలు మోపుతున్న కాపరికి చెట్ల పొదల్లో కొమురయ్య మృతి చెంది కనిపించాడు. దీంతో గొర్రెల కాపరి పోలీసులు, కుటుంబీకులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు అజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అప్పు చెల్లించాలని బంధువులు ఒత్తిడి చేయడంతో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టులో వ్యక్తి, వివాహం కావడం లేదని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పానీష్ తండాలో యువకు డు, మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని మహబూ బాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరంలో వ్యక్తి, ఆర్థిక కారణాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తాపీమేసీ్త్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

నలుగురి బలవన్మరణం

నలుగురి బలవన్మరణం