
పలకరిస్తే కన్నీళ్లే!
‘ఇంటర్ సిటీ’లో సాంకేతిక లోపం
● రెండు గంటలపాటు నిలిచిన రైలు
కేసముద్రం: సాంకేతిక లోపంతో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో రెండు గంటల పాటు నిలిచింది. దీంతో ఆప్‌లైన్‌లో వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా గంటపాటు నిలిచింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపునకు ఆప్‌లైన్‌లో వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో కేసముద్రం, ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య రాత్రి 8.10 గంటలకు నిలిచింది. దీంతో రైల్వే సిబ్బంది సమస్యను గుర్తించి మరమ్మతులు చేశారు. చివరకు రాత్రి 9.45 గంటల సమయంలో రైలు బయలు దేరింది. ఇదిలా ఉండగా ఇంటర్‌సిటీ వెనుక, ఆప్‌లైన్‌లో వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో గంటపాటు నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. అంతే కాకుండా ఆప్‌లైన్‌లో వెళ్లే రెండు గూడ్స్ రైళ్లు కేసముద్రం రైల్వే స్టేషన్‌లో నిలిచాయి. కాగా, ఇంటర్‌సిటీ రైలు రెండు గంటలు, వందేభారత్ సుమారు గంటపాటు నిలిచింది.
నెక్కొండలో గంటకు పైగా..
నెక్కొండ: సాంకేతిక లోపంతో గుంటూరు– సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ శనివారం రాత్రి నెక్కొండ రైల్వే స్టేషన్‌లో గంటకు పైగా నిలిచింది. రాత్రి 9.50 గంటలకు నెక్కొండకు చేరుకున్న రైలు 11.30 వరకు గంటకుపైగా నిలిచింది. ఈ విషయమై అధికారులను అడుగగా ఎస్–6 బోగిలో బ్రేక్ ఎయిర్ లీక్ కావడంతో రైలు నిలిచిందని తెలిపారు.