రాఖీ కట్టొస్తూ.. మృత్యుఒడికి | - | Sakshi
Sakshi News home page

రాఖీ కట్టొస్తూ.. మృత్యుఒడికి

Aug 10 2025 6:28 AM | Updated on Aug 10 2025 6:28 AM

రాఖీ కట్టొస్తూ.. మృత్యుఒడికి

రాఖీ కట్టొస్తూ.. మృత్యుఒడికి

ఎస్‌ఎస్‌తాడ్వాయి : రాఖీ కట్టొస్తూ ఓ అంగన్‌వాడీ టీచర్‌ మృత్యుఒడి కి చేరింది. బైక్‌ అదుపు తప్పిన ఘ టనలో మృతి చెందింది. ఈ ఘట న శనివారం గంగారం జీపీ పరిధిలోని నాంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం కొడిశాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ మొగిలిపల్లి పద్మ(42), భర్త కృష్ణయ్య బైక్‌పై మండలంలోని అంకంపల్లిలో సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లారు. రాఖీ కట్టి తిరిగొస్తుండగా గంగారం జీపీ పరిధిలోని నాంపల్లి సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వచ్చే కారును తప్పించి రోడ్డు దిగారు. మళ్లీ రోడ్డెక్కుతున్న క్రమంలో బైక్‌ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో పద్మకు తీవ్రంగా, కృష్ణయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ప ద్మను 108లో తాడ్వాయి పీహెచ్‌సీకి తీసుకొచ్చే క్ర మంలో మృతి చెందింది. రాఖీ కట్టి ఆనందంగా తి రిగొస్తున్న క్రమంలో పద్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో ముని గింది. కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్లు తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

పండుగకు ఇంటికెళ్తూ

ఆరెపల్లి వద్ద యువతి..

న్యూశాయంపేట : రాఖీ పండుగకు తమ్ముడితో కలిసి ఇంటికెళ్తున్న క్రమంలో బైక్‌ డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువతి చెందింది. ఈ ఘటన ఆరెపల్లి వద్ద చోటు చేసుకుంది. ఏనుమాముల సీఐ జవ్వాజి సురేశ్‌ కథనం ప్రకారం.. ములుగు జిల్లా ములుగు మండలం మంచినీళ్ల పల్లె గ్రామానికి చెందిన రాయనబోయిన శ్యామల(23) ములుగు రోడ్డులోని గార్డియన్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తోంది. రాఖీ సందర్భంగా శుక్రవారం రాత్రి తన తమ్ముడు శ్రీనుతో కలిసి బైక్‌పై తన గ్రా మానికి వెళ్తోంది. ఈ క్రమంలో ఆరెపల్లి సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్‌ దాటిన తర్వాత బైక్‌ డీవైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వెనుక కూర్చున్న శ్యామల అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

బైక్‌ అదుపు తప్పి అంగన్‌వాడీ టీచర్‌ మృతి

నాంపల్లి సమీపంలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement