
ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు
మహబూబాబాద్: సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేయనున్నట్ల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి శనివారం ఆయన రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి (ఎనర్టీ) నవీన్ మిట్టల్, రెడ్‌కో సీఎండీ, సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ భవనం నుంచి మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వారంలోగా సంబంధిత వివరాలను విద్యుత్ శాఖకు పంపించాలని తెలిపారు. మూడు సంవత్సరాల లోపు ప్రక్రియ పూర్తి అయ్యోలా అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజేందర్ రెడ్డి, డీఈ విజయ్ పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క