
ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దు
● ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
గంగారం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దని, రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు ఉన్నాయని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సీజన్‌కు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థినుల చదువు సామర్థ్యాలను పరిశీ లించారు. డిజిటల్ విధానంలో విద్యాబోధన కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మె నూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పాఠశా ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పా రిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు చేపించాలన్నారు. ప్రత్యేకాధికారులు వసతి గృహాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. కాగా, గంగారం గ్రామానికి చెందిన 350మంది రైతుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఇన్‌చార్జ్ కలెక్టర్‌ను మాజీ ఎంపీటీసీ బూర్క వెంకటయ్య కోరారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అజ్మీరా శ్రీని వాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేయాలి●
మహబూబాబాద్: ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మానుకోట మున్సిపాలిటీ పరిధి లో పలు వార్డులు, కూరగాయాల మార్కెట్, జంక్షన్లలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణకు కృషి చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు. పెండింగ్ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. కమిషనర్ రాజేశ్వర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.