పోలీసుల విస్తృత తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల విస్తృత తనిఖీలు

Aug 9 2025 7:43 AM | Updated on Aug 9 2025 7:43 AM

పోలీసుల విస్తృత తనిఖీలు

పోలీసుల విస్తృత తనిఖీలు

మహబూబాబాద్‌ రూరల్‌ : మానుకోట పట్టణంలో రక్షాబంధన్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శుక్రవారం డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని రైల్వే స్టేషన్‌, పలు సెంటర్లలో టౌన్‌ పోలీ సులు, జిల్లా బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీ లు నిర్వహించారు. టౌన్‌ ఇన్‌చార్జ్‌ సీఐ సర్వయ్య, ఎస్సైలు ప్రశాంత్‌, శివ, అశోక్‌, మౌనిక, బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది అంజయ్య, అశోక్‌, డాగ్‌ హ్యాండ్లర్‌ యాకయ్య ఉన్నారు.

అక్రమాలకు పాల్పడితే చర్యలు

కేసముద్రం: అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ పరిధిలోనిగిర్నితండాలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఎలాంటి ధ్రువపత్రాలు, నంబర్‌ ప్లేట్లు లేని 40 ద్విచక్రవాహనాలు, 2 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 లీటర్ల గుడుంబా, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. రూరల్‌ సీఐ సర్వయ్య, ఎస్సైలు మురళీధర్‌రాజు, నరేష్‌ ఉన్నారు.

సైబర్‌ మోసం

రూ.లక్ష పోగొట్టుకున్న డోర్నకల్‌ వాసి

డోర్నకల్‌: సైబర్‌ మోసగాళ్ల వలలో పడి డోర్నకల్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.లక్ష మోసపోయాడు. డోర్నకల్‌ సీఐ బి.రాజేశ్‌ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్ర పోలీస్‌శాఖలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న డోర్నకల్‌ మండలం చాప్లాతండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్‌ పేరిట ఫేస్‌బుక్‌లో ఫర్నీచర్‌ అమ్ముతున్నట్లు ఈనెల 1న ఐడీ కనిపించడంతో డోర్నకల్‌కు చెందిన పాట్ని ఆర్యన్‌జైన్‌ అదే రోజు రూ.70వేలను సంబంధిత ఐడీ అకౌంట్‌కు బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మరికొంత డబ్బు పంపాలని సమాచారం రావడంతో మరోసారి రూ.30 వేలు పంపాడు. కొద్దిరోజుల వరకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఆర్యన్‌జైన్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు వెంటనే నిందితుడి అకౌంట్‌ను గుర్తించి అందులోని రూ.28 వేలను హోల్డ్‌లో ఉంచారు. కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement