
‘భూ భారతి’ని వేగవంతం చేయాలి
● అడిషనల్ కలెక్టర్ అనిల్‌కుమార్
కురవి: భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ అనిల్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. కార్యాలయానికి వచ్చి రైతుల సమస్యలను విని పరిష్కరించాలని సూచించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లను సత్వరమే అందించాలన్నారు. కార్యక్రమంలో డీటీ గణేశ్, ఆర్‌ఐ రవికుమార్ పాల్గొన్నారు. కాగా, మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, ఎస్సీ బాలికల వసతి గృహంలోని సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గంధసిరి జ్యోతిబసు, కొలిపాక వీరేందర్, జశ్వంత్, యాకన్న, తరుణ్, విగ్నేష్ పాల్గొన్నారు.