
ఓం వరలక్ష్మీ దేవాతాయనమః
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు శ్రీవరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వ్రతం అనంతరం లక్ష్మీదేవికి చీరరవికలు, నైవేధ్యాలు సమర్పించారు. ఒకరికొకరు నైవేధ్యప్రసాదాలు, వాయినాలు అందించుకున్నారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. నగరంలోని వేయిస్తంభాల దేవాలయం, శ్రీభద్రకాళి దేవాలయం, ఎంజీఎం సమీపంలోని రాజరాజేశ్వరస్వామి వారి దేవాలయం, హంటర్‌రోడ్‌ని సంతోషిమాత దేవాలయం, శ్రీకాశీవిశేశ్వరస్వామి వారి దేవాలయం, పలు వేంకటేశ్వరస్వామి దేవాలయాలలోనూ వందలాది మంది భక్తులు పూజల్లో పాల్గొన్నారు.
వరాల రుద్రునిగా శ్రీరుద్రేశ్వరస్వామి..
శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసోత్సవాలలో భాగంగా శ్రీరుద్రేశ్వరస్వామి వారిని 11కిలోల పసుపు, 11కిలోల కుంకుమతో వరాల రుద్రునిగా అలంకరించి పూజలు, మహాహారతి జరిపి భక్తులకు సందర్శనం కల్పించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రణవ్, సందీప్‌శర్మ రుద్రాభిషేకం నిర్వహించారు.
భద్రకాళి దేవాలయంలో..
శ్రీభద్రకాళి దేవాలయంలో అమ్మవారికి శ్రావణమాసపూజలు నిర్వహించా రు. శుక్రవారం కావడంతో వేలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని వాయినాలు ఇచ్చుకున్నారు. వ రంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి , మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.
–హన్మకొండ కల్చరల్

ఓం వరలక్ష్మీ దేవాతాయనమః

ఓం వరలక్ష్మీ దేవాతాయనమః

ఓం వరలక్ష్మీ దేవాతాయనమః