సొంతింటి కల నెరవేరుస్తాం | - | Sakshi
Sakshi News home page

సొంతింటి కల నెరవేరుస్తాం

Aug 9 2025 7:43 AM | Updated on Aug 9 2025 7:43 AM

సొంతి

సొంతింటి కల నెరవేరుస్తాం

హన్మకొండ అర్బన్‌: రాష్ట్రంలో అర్హులైన ప్రతీ పేదకుటుంబ సొంతింటి కలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండలోని బాలసముద్రం అంబేద్కర్‌నగర్‌లో జీ ప్లస్‌ త్రీ విధానంలో నిర్మించిన 592 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, మేయర్‌ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్‌, డాక్టర్‌ సత్యశారదతో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు. అనంతరం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి, తన వద్దకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పలుమార్లు వచ్చారన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టి ఆరు సంవత్సరాలైన గత పాలకులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల కాలంలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చిన పాపానపోలేదన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల మందిని పాత కార్డుల్లో కొత్తగా చేర్చామని, ఆరు లక్షల మందికి కొత్తగా రేషన్‌ కార్డులు ఇచ్చిన ఘనత తమదేనన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన దానికంటే

సంతోషంగా ఉంది..: నాయిని

పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం ఎమ్మెల్యేగా గెలిచిన దానికంటే సంతోషంగా ఉందని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. గుడిసెలు వేసుకున్న అందరికీ ఇళ్లు కేటాయించామని, ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారికి తప్పనిసరిగా న్యూ శాయంపేటలో కేటాయిస్తామన్నారు. ఇంకా చాలా మంది నిరుపేదలున్నారని, శాయంపేట, తదితర ప్రాంతంలో ప్రభుత్వ భూములు గుర్తించి అక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేవిధంగా కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటిని కోరారు. 592మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండా 2,500 మంది వద్ద అక్రమంగా ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రి, ప్రజాప్రతినిధులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తీవ్ర కష్టాలు అనుభవించిన రహీమున్సీసాకు తొలి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్‌ ఇనగాల వెంకటరామిరెడ్డి, కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా

20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హనుమకొండలో డబుల్‌ బెడ్‌రూం,

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

సొంతింటి కల నెరవేరుస్తాం1
1/2

సొంతింటి కల నెరవేరుస్తాం

సొంతింటి కల నెరవేరుస్తాం2
2/2

సొంతింటి కల నెరవేరుస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement