ఆ పార్టీలను వెలివేద్దాం | - | Sakshi
Sakshi News home page

ఆ పార్టీలను వెలివేద్దాం

Aug 9 2025 7:43 AM | Updated on Aug 9 2025 7:43 AM

ఆ పార

ఆ పార్టీలను వెలివేద్దాం

కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ వైఖరిని ప్రజల్లో ఎండగడుతాం

2028లో వచ్చేది బీసీ ప్రభుత్వమే

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న పిలుపు

హన్మకొండ: బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ వైఖరిని ప్రజల్లో ఎండగడుతా మని, ఆ మూడు పార్టీలను బీసీలు వెలివేయాలని ఎమ్మెల్సీ, బీసీ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ తీన్మార్‌ మల్లన్న పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని, తాను నాలుగు నెలల క్రితమే చెప్పానన్నారు. ఢిల్లీకి వెళ్లి రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పి, ఇప్పుడు తాము రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ అడిగితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా అడ్డుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్ప డం విడ్డూరమన్నారు. తమ వల్ల కాదని కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్తున్నారని విమర్శించారు. అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పుతున్నట్లు జనాభా ఎంతో అంతే అవకాశాలు కల్పించాలన్న దానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంటుందా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి బీసీలపై తన స్టాండ్‌ ఏమిటో చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, చట్టసభల్లోని బీసీ జేఏసీ పోటీ చేస్తుందన్నారు. 2028లో ఏర్పడేది బీసీ ప్రభుత్వమేనన్నారు. సమావేశంలో ఎం.జానయ్య, రజనీకుమార్‌, సూదగాని హరిశంకర్‌, నవీన్‌, నర్సింహగౌడ్‌, ప్రవీణ్‌, రవి పటేల్‌ పాల్గొన్నారు.

అనారోగ్యంతో ఖోఖో మాజీ క్రీడాకారుడు సారంగపాణి మృతి

ఖిలా వరంగల్‌: ఖిలావరంగల్‌ మధ్యకోటకు చెందిన అంతర్జాతీయ ఖోఖో మాజీ క్రీడాకారుడు నాగవెల్లి సారంగపాణి(48) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లానుంచి అంతర్జాతీయస్థాయి వరకు ఎదిగిన సారంగపాణి.. పలువురు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన చేతిలో ఎంతో మంది క్రీడాకారులు శిక్షణ పొంది అంతర్జాతీయస్థాయికి ఎదిగారు. ేఆయనకు భార్య, ఒక దత్తపుత్రిక ఉంది. విషయం తెలిసి తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఖోఖో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎథిక్స్‌ కమిషన్‌ కన్వీనర్‌, తెలంగాణ ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి.. సారంగపాణి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఆయన వెంట ఖోఖో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌, కై లాస్‌ యాదవ్‌, తదితర క్రీడాకారులు ఉన్నారు.

ఆ పార్టీలను వెలివేద్దాం
1
1/2

ఆ పార్టీలను వెలివేద్దాం

ఆ పార్టీలను వెలివేద్దాం
2
2/2

ఆ పార్టీలను వెలివేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement