
కాజీపేట మీదుగా వెళ్లే 16 రైళ్లు పొడిగింపు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్‌తో మేజర్ అప్‌గ్రేడేషన్ వర్క్స్‌తో ఆగస్టు 6వ తేదీ నుంచి అక్టోబర్ 19 వరకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు కాచిగూడ, మల్కాజ్‌గిరి వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు.
పొడిగింపు రైళ్ల వివరాలు..
విజయవాడ–సికింద్రాబాద్ (12713) వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ నుంచి సికింద్రాబాద్–విజయవాడ (12714) వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ నుంచి సికింద్రాబాద్–పోరుబందర్ (20967) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను, ఉమ్‌దానగర్ నుంచి పోరుబందర్–సికింద్రాబాద్ (20968) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను, ఉమ్‌దానగర్ నుంచి సికింద్రాబాద్–మణుగూరు (12745) వెళ్లే డైలీఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి, మణుగూరు–సికింద్రాబాద్ (12746) వెళ్లే డైలీ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి, సికింద్రాబాద్–దర్భాంగా (17007) వెళ్లే బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి, దర్బాంగా–సికింద్రాబాద్ (17008) వెళ్లే బైవీక్లి ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి, ముజఫరుద్దీన్–సికింద్రాబాద్ (05293) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి, సికింద్రాబాద్ –ముజఫరుద్దీన్ (05294) వెళ్లే వీక్లి ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి నుంచి, సికింద్రాబాద్–సంత్రగచ్చి (07221) వెళ్లే బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి, సంత్రగచ్చి–సికింద్రాబాద్ (07222) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి, సికింద్రాబాద్–దానాపూర్ (07647) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి, దానాపూర్–సికింద్రాబాద్ (07648) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి, హైదరాబాద్–రక్సోల్ (07051) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి, రక్సోల్–చర్లపల్లి (07052) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.