చదువు విలువ తెలిసిన వారికే మద్దతు | Sakshi
Sakshi News home page

చదువు విలువ తెలిసిన వారికే మద్దతు

Published Fri, Nov 17 2023 1:20 AM

- - Sakshi

నాయకుడికి చదువు విలువ తెలిస్తే.. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు ఉపాధి మార్గం చూపాలనే ఆలోచన వస్తుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి పరిశ్రమలు నెలకొల్పడం, అవినీతి రహిత పాలన, అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించే వారికే ఓటేస్తాను. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వారికే నా మద్దతు.

– పుట్ట రోహన్‌, బీటెక్‌,

సాయినగర్‌ నాలుగో వీధి, డోర్నకల్‌

ఓటు వృథా కావద్దు..

తొలిసారి ఓటు హక్కు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటాను. ఎప్పుడెప్పుడు ఓటు వేయాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అయితే తొలిసారి వేసే ఓటుకు ప్రాధాన్యత ఉంటుంది. మంచి నాయకుడిని ఎన్నుకోవడమే నా లక్ష్యం. ఓటు వృథా కావద్దు. విద్యా, వైద్యం, ఉపాధి మార్గాలు చూపే నాయకుడు కావాలి.

– జి.అఖిల, విద్యార్థిని, తొర్రూరు

1/3

2/3

3/3

Advertisement
Advertisement