కర్నూలు(సెంట్రల్):ప్లాస్టిక్ బ్యాగులు వద్దు..జ్యూట్, దుస్తులు, పేపర్‌తో తయారు చేసిన బ్యాగులనే వినియోగించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలను పురస్కరించుకునిగురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పీసీబీ అధికారులు అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా పీసీబీ ప్రాంతీయాధికారి పీవీ కిశోర్‌కుమార్ మాట్లాడుతూ..సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందన్నారు. అందువల్ల ప్రజలు జ్యూట్ బ్యాగులను వినియోగించాలని సూచించారు.


