పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ మూకల దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ మూకల దౌర్జన్యం

Nov 6 2026 1:50 AM | Updated on Nov 6 2026 1:50 AM

● భయభ్రాంతులకు గురైన ఓటర్లు

● భయభ్రాంతులకు గురైన ఓటర్లు

కర్నూలు సిటీ: పోలింగ్‌ కేంద్రాల్లో కేడీసీసీ చైర్మన్‌ డి.విష్ణువర్ధన్‌ రెడ్డి అనుచరులు దౌర్జన్యం చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. కల్లూరు మండలంలో గురువారం జరిగిన జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక ఎన్నికల్లో 66.58 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 77,575 మంది ఓటర్లకుగాను, 51,652 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. బసాపురం(తొలిశాపురం, ఎదురూరు, ఆర్‌.కె దుద్యాల, బసాపురం గ్రామాలు) ఎంపీటీసీగా పోటీ చేస్తున్న బోయ సరస్వమ్మ స్వగ్రామం ఎదురూరు. కేడీసీసీ చైర్మన్‌ డి.విష్ణువర్ధన్‌ రెడ్డి స్వగ్రామం కూడా అదే కావడంతో పోటీలో నుంచి తప్పుకోవాలని బెదిరించినా విత్‌డ్రా చేసుకోలేదు. ఇటీవల ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఎన్నికల రోజున ఏజెంటు ఫారాలు ఇవ్వకుండా, అభ్యర్థితో పాటు ఆమె భర్త బి.రంగయ్య, కుమారుడు బోయ వెంకటేష్‌, ఇతర కుటుంబ సభ్యులను సైతం ఓటు కూడా టీడీపీ ముఠాలు దౌర్జన్యం చేశాయి.

● సుంకేసుల పోలింగ్‌ స్టేషన్‌లో ఓ ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ ఇద్దరు ఉన్నా..స్థానిక టీడీపీ నేతలే ఓట్లను వేసేసుకున్నారు. అక్కడే విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓ, ఇతర సిబ్బంది పట్టించుకోకుండా వారికి సహకరించారు.

● ఆర్‌.కొంతలపాడులో రెండు చోట్ల ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో విష్ణు అనుచరులు సాయిక్రిష్ణ, మరి కొంత మంది, ఎదురూరు గ్రా మంలో నరసింహారెడ్డి, రఫీ అనే వారు ఓటరు దగ్గర వెళ్లి టీడీపీ గుర్తులపై వేయించారు.

● తొలిశాపురంలో క్యూలో ఓటర్లు ఉన్నా వారిని ఓటు వేయనీయలేదు. ఆ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌ రెడ్డి బంధువు మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ల బదులు టీడీపీ నేతలే ఓట్లు వేశారు. వీరికి పోలీసులు దగ్గర ఉండి సహాయం చేయడంపై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement