హాలహర్వి ఆర్‌ఓగా విద్యాసాగర్‌ | - | Sakshi
Sakshi News home page

హాలహర్వి ఆర్‌ఓగా విద్యాసాగర్‌

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు

కర్నూలు(అర్బన్‌): హాలహర్వి మండల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా ఎల్‌ఎల్‌సీ డీఈఈ విద్యాసాగర్‌ను నియమించినట్లు స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి/జెడ్పీ సీఈఓ ఆర్‌.సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఆర్‌ఓగా విధులు నిర్వహించిన ఆదోని పీఆర్‌ఈఈ డీసీ వెంకటేష్‌ అనారోగ్యానికి గురయ్యారన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్వోగా విద్యాసాగర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.

30న డాక్‌ అదాలత్‌

కర్నూలు(అర్బన్‌): కర్నూలు డివిజన్‌ పరిధిలోని తపాల కార్యాలయాల్లో అందించే సేవలకు సంబంధించిన ఫిర్యాదులతో పాటు ఇతర ప్రజా ఫిర్యాదులను ఈ నెల 28న స్వీకరించనున్నట్లు కర్నూలు డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జి.జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదులను ఈ నెల 28వ తేదీ లేదా అంతకు ముందే చేరేలా పోస్టు ద్వారా పంపుకోవాలన్నారు. పోస్టు కవర్‌పై ‘డాక్‌ అదాలత్‌’ అని పెద్ద అక్షరాలతో రాసి పంపాలన్నారు. ఫిర్యాదుదారులు నేరుగా ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 30న ఉదయం 11 గంటలకు డాక్‌ అదాలత్‌కు హాజరు కావచ్చన్నారు. డాక్‌ అదాలత్‌లో ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం అర్జీకి సంబంధించిన పరిష్కారం లెటర్‌/ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదుదారునికి తెలియజేస్తామన్నారు.

ఈవీఎం స్ట్రాంగ్‌రూంల పరిశీలన

కర్నూలు: నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో గుత్తి పెట్రోల్‌ బంకు సమీపంలోని అథెనా స్కూల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం, వెంకటరమణ కాలనీ వెనుకనున్న కేశవరెడ్డి స్కూల్‌, శ్రీజ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రాలతో పాటు ఈవీఎం స్ట్రాంగ్‌ రూం కౌంటింగ్‌ కేంద్రాలను కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కర్నూలు అర్బన్‌ తాలూకా సీఐ తేజోమూర్తి డీఐజీ వెంట ఉన్నారు.

30న పింఛన్ల పంపిణీ

కర్నూలు(అగ్రికల్చర్‌): నవంబర్‌ నెల పింఛన్ల పంపిణీ ఈ నెల 30న చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్‌ 1న అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. 31న సచివాలయ ఉద్యోగులు పోలింగ్‌ విధుల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో పింఛన్లు ఈనెల 30న పంపిణీ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 2,32,203 పింఛన్లకు రూ.102.58 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,08,581 పింఛన్లకు రూ.90.64 కోట్లు మంజూరయ్యాయి.

నందికొట్కూరు: వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సోమవారం చేరారు. పాములపాడు మండల పరిధిలోని వేంపెంట, మిట్టకందాల, భానుముక్కల, మద్దూరు గ్రామాల నుంచి 100 కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు నందికొట్కూరుకు వచ్చారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ నాగరాజు ఆధ్వర్యంలో వారికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ దార సుధీర్‌, యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో మాజీ వైస్‌ ఎంపీపీ భానుముక్కల బండ్లమూరి వెంకటేశ్వర్లు, వేంపెంట వడ్డెర కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ రామసుబ్బయ్య, మిట్టకందాల బీమశంకర్‌, కృష్ణానగర్‌ పీరయ్య, రమణారెడ్డి, లింగాల స్వామి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వెంకటస్వామి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement