‘స్థానిక’ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

ఆదోని రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ఖమర్‌, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ ఆదేశించారు. సోమవారం ఆదోని మండలం విరుపాపురం గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ రూమ్‌, రిసెప్షన్‌ కేంద్రాలను వారు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వీరి వెంట ఏఎస్పీ జయశర్మ, ఆర్డీఓ అరుణాదేవి, తహసీల్దార్‌ వేణుగోపాలరావు, ఆయాశాఖల అధికారులు ఉన్నారు.

ఎమ్మిగనూరురూరల్‌: అలాగే ఎమ్మిగనూరు పట్టణంలోని జూనియర్‌ కాలేజీ, ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాలు, రిస్పెషన్‌ కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ఖుమర్‌, ఆదోని ఆర్టీవో ఆరుణదేవి పరిశీలించారు. కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement