ఆలూరు: ప్రజా సమస్యలపై మండల స్థాయిలో తమ వాణిని వినిపించేందుకు విద్యావంతులు సిద్ధమయ్యారు. పలు ఉద్యోగాలు వదులుకుని ప్రజల తరఫున పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ప్రజాప్రతినిధులుగా తమకు మంచి అవకాశం వస్తుందని ఆత్మస్థైర్యంతో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశారు. గ్రామాలకు మేలు చేయడానికే ఇలా చేశామని వారు తెలిపారు. వారి అభిప్రాయాలు..
మా నాన్న దేవిరెడ్డి సర్పంచ్‌గా పనిచేశారు. ప్రజల కోసం సీసీరోడ్లు వేశారు. డ్రెయినేజీల సదుపాయం కల్పించారు. ప్రజాసేవకు అంకితమై పనిచేశారు. నా లక్ష్యం ఇదే. సీఏ చదివిన నేను ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. ప్రజాసేవకు అంకితం అయ్యాను.
– రాంప్రసాద్‌రెడ్డి, మనేకుర్తి
మా నాన్న పోలీస్‌గా పనిచేశారు. నేను బీకాం చదివి ప్రైవేటు ఉద్యోగంలో కొన్ని రోజులు పనిచేశాను. ప్రజాప్రతినిధిగా ఎంపిక అయితే బాగుండేదని ఆలోచన చేశాను. అందరికీ ఉపయోగంగా ఉంటానని రాజకీయాల్లోకి వచ్చాను. పట్టణ కేంద్రమైన ఆలూరులో 2 వార్డు ఎంపీటీసీ స్థానాన్ని ఆన్ రిజర్వ్‌కు కేటాయించారు. ఆ స్థానం నుంచి బరిలో ఉన్నాను.
– వరుణ్‌కుమార్, ఆలూరు


