అక్రమ మద్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం స్వాధీనం

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

అక్రమ మద్యం స్వాధీనం

పెద్దకడబూరు: అక్రమ మద్యం అమ్మతున్నట్లు రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ పి.భార్గవరెడ్డి తెలిపారు. వివరాలు.. మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామానికి చెందిన ఈడిగ రమేష్‌ అక్రమ మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందిందన్నారు. శుక్రవారం దాడులు నిర్వహించి అతని ఇంట్లో 16 ఒరిజినల్‌ చాయిస్‌ విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసినా, అమ్మినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యంపై సమాచారం తెలిస్తే 94409 02580 నంబర్‌కు ఫోన్‌చేసి తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎకై ్సజ్‌ ఎస్‌ఐ కార్తీక్‌సాగర్‌, ట్రైనీ ఎస్‌ఐ ధనుంజయ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement