రమణీయం.. మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

రమణీయం.. మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

హొళగుంద: దసరా ఉత్సవాలకు ప్రఖ్యాతిగాంచిన దేవరగట్టులో శుక్రవారం రాత్రి మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం రమణీయంగా జరిగింది. దేవరగట్టు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు, గ్రామపెద్దలు రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో పూజారులు మాత మాళమ్మ, మల్లేశ్వరస్వామి విరాట్‌మూర్తులకు జలాభిషేకాలు, సుప్రభాత సేవ, బండరార్చన, నైవేద్య సంతర్పణ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కనులపండవగా రథోత్సవం

జైత్రయాత్ర అనంతరం మల్లప్ప గుడిలోని సింహాసన కట్టపై కొలువుదీరిన ఉత్సవ మూర్తులకు పుజారులు అభిషేకాలు, మహామంగళహారతి, ఆకుపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆచారం ప్రకారం సాయంత్రం బిలేహాళ్‌ గ్రామం నుంచి దేవరగట్టుకు కుంభం, గజమాల చేరిన అనంతరం రథాంగ, ఇతర ప్రత్యేక పూజలనంతరం స్వామివారి రథోత్సవాన్ని అశేష భక్త జనుల జయజయ ధ్వనుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. రథోత్సవం ఎదురు బసవన్నగుడి వరకు సాగింది. రథం ముందు కోలాటాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హొళగుంద ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement