కమనీయం.. ఉగ్ర నృసింహుడి పవిత్రోత్సవం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. ఉగ్ర నృసింహుడి పవిత్రోత్సవం

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలం జ్వాలా నృసింహ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవ ంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున నిత్య పూజల అనంతరం మూలవిరాట్‌ జ్వాలా నృసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవార్లకు పవిత్ర మాలలను ధరింపచేశారు. అనంతరం ఉత్సవమూర్తులైన జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను యాగశాలలో కొలువుంచి నవకలశ స్నపనం, ద్వారతోరణ పూజ, మండల ప్రతిష్ట, కుంభ ప్రతిష్ట నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పవిత్ర హోమం జరిపించారు. రాత్రి ఉభయ దేవేరులతో ఉగ్ర నరసింహస్వామి విశేష పుష్పాలకంరణ గావించిన ఉత్సవ పల్లకీని అధిష్టించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు

నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం

పవిత్రోత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులను కొలువుంచి వేద మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించిన స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా సాగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం, గంధంతో పండితుల వేధఘోషనల ఽమధ్య స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హోమం నిర్వహించి మంగళ హారతి, తీర్థప్రసాద గోష్టి వితరనతో మొదటి రోజు కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement