ఆదుకున్న స్నేహ‘హస్తం’ | - | Sakshi
Sakshi News home page

ఆదుకున్న స్నేహ‘హస్తం’

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

దేవనకొండ: స్నేహితుడు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తోటి మిత్రులు అండగా నిలిచారు. వివరాలు.. దేవనకొండకు చెందిన వడ్డె విజయ్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని మిత్రులు సాయం చేయాలని భా వించారు. విజయ్‌తో కలిసి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ చదువుకున్న మిత్రులు, పూర్వ విద్యార్థులు కలిసి రూ.65,500 సేకరించి బాధి త కుటుంబానికి శుక్రవారం నగదు అందజేశా రు. కష్టకాలంలో విజయ్‌ కుటుంబానికి అండ గా నిలిచి స్నేహబంధాన్ని చాటుకున్నారు. బా ధిత కుటుంబీకులు వారికి కృతజ్ఞతలు తెలిపా రు. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులను పలువురు అభినందించారు.

మల్లన్న సేవలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అన్షుమన్‌ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన వీరికి రాజగోపురం వద్ద అధికారులు, అర్చక స్వాము లు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్‌ అన్షుమన్‌ తంపతులు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూ జలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మ వారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తి దంపతులకు వేద పండితు లు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.

బైక్‌లు ఢీకొని

నలుగురికి గాయాలు

ఆదోని అర్బన్‌: మండల పరిధిలోని ఇస్వీ గ్రా మ సమీపంలో శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొన్న ఘట నలో నలుగురికి గాయాలయ్యాయి. ఇస్వీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌతా ళం మండలం లింగాలదిన్నె గ్రామానికి చెంది న బసవరాజు, హనీ ఒక బైకుపై, కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన రమేష్‌, అనుశ్రీ మరో బైకుపై వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బెల్టు షాపులపై దాడులు

డోన్‌ టౌన్‌: అక్రమ బెల్టు షాపులపై దాడులు చేసి మద్యం, నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు డోన్‌ ఎకై ్సజ్‌ సీఐ జప్రూల్లా శుక్రవారం తెలిపారు. బేతంచెర్లలో 12 మద్యం సీసాలు, డోన్‌ పట్టణంలో 8 సీసాలు, ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి గ్రామంలో ఒక మహిళ వద్ద నుంచి 4 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే ఐదుగురు వ్యక్తులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసి తహసీల్దార్‌ ఎదుట హాజరుపరచినట్లు తెలిపారు. అక్రమ మద్యం, నాటు సారా, బెల్టు షాపుల సమాచారం తెలిస్తే 94400 52892 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సీఐ లక్ష్మణదాసు, ఎస్‌ఐలు సోమశేఖర్‌రావు, దౌలత్‌ఖాన్‌, రమేష్‌బాబు సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement