వైభవంగా తిరుచ్చి మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా తిరుచ్చి మహోత్సవం

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

బేతంచెర్ల: మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం శివార్లో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో తిరుచ్చి మహోత్సవం ఆశ్వయుజ మాసం సందర్భంగా శుక్రవారం స్వామి వారు పల్లకీలో కొలువై శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఉప కమిషనర్‌ రామాంజనేయులు వేద పండితులు జ్వాలా, కళ్యాణ చక్రవర్తి, అర్చకులు మద్దిలేటి నరసింహ స్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుంచి ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ ఊరేగింపు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement