బేతంచెర్ల: పట్టణంలోని అయ్యల చెర్వులోని ఓ పాలిస్ ఫ్యాక్టరీలో ఒండ్రు మట్టి గుంతలో పడి ట్యాంకర్ హెల్పర్ వెంకట సుబ్బయ్య ఆచారి (57) మృతి చెందాడు. ఫ్యాక్టరీలోని ఒండు గుంతలో ఉన్న ఒండ్రు మట్టిని ట్యాంకర్లోకి ఎక్కించే క్రమంలో ప్రమాదవశాత్తు మరోవైపున ఉన్న ఒండు స్పీడుగా వచ్చి అతనిపై పడటంతో ఒండులో చిక్కుకపోయి ఊపిరాడక మృతి చెందాడు. చివరకు జేసీబీ ద్వారా ఒండును తొలగించి మృత దేహాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


