● ఊరంతా గడేకార్లే.. ఇంటికి ఇద్దరు, ముగ్గురు! ● నాడు కూలి కోసం ఆరాటం.. నేడు నిర్మాణ రంగానికి దిక్సూచి ● ఒక్కరితో ప్రారంభమైన ప్రస్థానం.. నేడు వేలల్లో | - | Sakshi
Sakshi News home page

● ఊరంతా గడేకార్లే.. ఇంటికి ఇద్దరు, ముగ్గురు! ● నాడు కూలి కోసం ఆరాటం.. నేడు నిర్మాణ రంగానికి దిక్సూచి ● ఒక్కరితో ప్రారంభమైన ప్రస్థానం.. నేడు వేలల్లో

Oct 19 2026 2:01 AM | Updated on Oct 19 2026 2:01 AM

● ఊరంతా గడేకార్లే.. ఇంటికి ఇద్దరు, ముగ్గురు! ● నాడు కూలి కోసం ఆరాటం.. నేడు నిర్మాణ రంగానికి దిక్సూచి ● ఒక్కరితో ప్రారంభమైన ప్రస్థానం.. నేడు వేలల్లో

భవన నిర్మాణ రంగం (రాతి గోడల)లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది ఆళ్లడ్డ మండలంలోని ఓబులంపల్లె గ్రామం. ప్రస్తుతం దాదాపు ఆ ఊరంతా గడేకార్లే (తాపీ మేసీ్త్రలు, శ్రామికులే). ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఈ వృత్తిలోనే జీవనం సాగిస్తున్నారు. ఏదైనా ఒక పెద్ద మార్పు చిన్న అడుగుతోనే మొదలవుతుందనేందుకు ఈ ఊరికి చెందిన వ్యక్తే నిదర్శనం. దశాబ్దాల క్రితం ఈ గ్రామం నుంచి ఉపాధి, సరైన ఆదాయ మార్గాలు లేక ఆళ్లగడ్డలో పనిచేస్తున్న గడేకారి సుబ్బరాయుడు పావలాకు పనికి వెళ్లి గడేకారి పని (రాళ్లు మొలచడం, గోడలు కట్టడం) నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్న విద్య, సంపాదించిన నైపుణ్యం ఊరిలోని మిగిలిన యువతకు ఆదర్శంగా నిలిచింది. ఒకరిని చూసి ఒకరు.. అలా నైపుణ్యం ఊరిలోని మిగిలిన యువతకు మార్గదర్శకంగా నిలిచింది. ఒకరిని చూసి ఒకరు అలా ఒకతరం నుంచి మరో తరానికి ఈ విద్య పాకింది. నాడు ఒక్కరితో ప్రాంభమైన ఈ ప్రస్థానం.. నేడు వేల సంఖ్యలో మేసీ్త్రలను, గడేకార్లను తయారు చేసే స్థాయికి చేరింది. నేడు జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ పెద్ద నిర్మాణం జరగాలన్నా ముఖ్యంగా రాతి గోడల నిర్మాణం అంటే ఓబులంపల్లె గడేకార్లు చేయాల్సిందే. ఒకప్పుడు కొట్టాలు, గుడిసెలు ఉండిన ఆ ఊరు ప్రస్తుతం, మిద్దెలు, మేడలు, భవన సముదాయాలతో కళకళలాడుతోంది. దేశవ్యాప్తంగా ఉపాధి పొందుతూ వేల మందికి జీవనోపాధి చూపిస్తున్నారు. ఇంట్లో తండ్రి మేసీ్త్ర అయితే కొడుకులు ఆయనకు సహాయకులుగా చేరి కొన్నాళ్లకే నైపుణ్యం ఉన్న మేసీ్త్రలుగా మారిపోతున్నారు. గ్రామంలో 950 గృహాలు ఉండగా 3 వేల జనాభా ఉంది. 1000 మందికి పైగా గడేకారి వృత్తిలోనే ఉన్నారు. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున పురుషులు ఈ భవన నిర్మాణ రంగంలోనే స్థిరపడి కుటుంబాలకు ఆధారంగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement