కర్నూలు: ఎన్నికల వేళ కర్నూలు నడిబొడ్డు బంగారుపేటలో అలజడి నెలకొంది. కాలనీ లో నివాసముంటున్న రౌడీషీటర్ కె.కృష్ణ అలియాస్ కేకే కూతురు గీత (19) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కృష్ణ, సుజాత దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. కూతురు గీత ఓ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలనీ లో నివాసముంటున్న షికారి శివకు వివాహమైనప్పటికీ గీతను ప్రేమించాడు. వీరి మధ్య సాగుతున్న ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏడాది క్రితం షికారి శివను పిలిపించి మందలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అయినప్పటికీ గీతతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం గీత మిద్దైపె ఉండగా శివ వెళ్లి ఘర్షణ పడ్డాడు. ఈ నేపథ్యంలో గీత పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోగా.. ఆమె స్నే హితురాలైన అర్చనను మిద్దె పైకి పంపి శివ అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబస భ్యులు యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్సలు చే యించగా కోలుకోలేక మృతి చెందింది. దీంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నిందితుడు మంత్రి అనుచరుడికి
సన్నిహితుడు..
గీత మరణానికి కారకుడైన ప్రేమికుడు షికారి శివకు మంత్రికి ప్రధాన అనుచరుడుగా ఉన్న సురేష్ ఈ విషయంలో అండగా ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్ ఓ హోటల్లో పనిచేస్తా డు. ఆనంద్ టాకీస్‌కు ఎదురుగా హంద్రీ బ్రిడ్జి స్థలాన్ని ఆక్రమించి హోటల్ ఏర్పాటు చేసుకు ని వ్యాపారం సాగిస్తున్నాడు. ఇందుకు మంత్రి అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ప్రస్తుతం టీడీపీ కార్పొరేషన్ అభ్యర్థిగా సురేష్ భార్యను మంత్రి రంగంలోకి దింపాడు. దీంతో షికారి శివకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సురేష్ అజ్ఞాతంలోకి పంపినట్లు మృతురాలు గీత కుటుంబ సభ్యు లు ఆరోపిస్తున్నారు. గీత తండ్రికి నేర చరిత్ర ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగి సమస్యను బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు. గీత మృతిపై ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరినప్పటికీ ‘అవసరం లేదు.. నా కూతురు మరణానికి కారకుడైన షికారి శివ అంతు చూస్తానంటూ’ తండ్రి కృష్ణ ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు. పోలీసులు సమస్య తీవ్రతను గుర్తించి గుట్టుచప్పుడు కాకుండా రెండు రోజులుగా కాలనీలో పికెట్‌ను ఏర్పాటు చేశారు.
మృతురాలి కుటుంబీకులకు
ఎస్వీ పరామర్శ
మృతురాలు గీతకు ఆదివారం ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటన తీవ్రత దృష్ట్యా బంగారుపేటలో పికెట్ కొనసాగుతోంది. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి బాధితుల ఇంటికి వెళ్లి కృష్ణ దంపతులను పరామర్శించి ఓదార్చారు. ప్రేమ పేరుతో షికారి శివ గీతను వేధించాడని కుటుంబ సభ్యులు మోహన్‌రెడ్డితో చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. బలవంతంగా ప్రేమికుడే తమ కూతురికి పురుగు మందు తాపించాడని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్వీ కోరారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
యువతి ఆత్మహత్య
నిందితుడికి టీడీపీ కార్పొరేషన్
అభ్యర్థి భర్త సహకారం
రెండు రోజులుగా కాలనీలో
పోలీస్ పికెట్
గోప్యంగా ఉంచిన పోలీసులు


