చిన్నతనంలో చాలా ఇబ్బందులు పడేవాళ్లం. నాకు సుమారు 13 ఏళ్లు ఉన్నప్పుడు మొదటగా కందుకూరు డ్యాం నిర్మాణం జరుగుతున్నప్పుడు మా ఊరి గడేకార్ల వెంట రాళ్లు అందించేందుకు అర్ద రూపాయి కూలికి వెళ్లాను. అప్పటి నుంచి కొంచెంచం పెరుగుతూ.. వైఎస్సార్ సీఎం అయ్యే వరకు రూ. 60, నుంచి రూ. 65 కూలి ఇచ్చేవారు. ఆయన సీఎం అయ్యి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో ఒక్క సారిగా రూ. 65 ఉన్న కూలి రూ. 300కు పెరిగింది. – నొస్సం గులాం రసూల్
●


