మాది నిరుపేద కుటుంబం. పదేళ్ల క్రితం నాన్న కుళ్లాయప్ప మృతి చెందాడు. నాతో పాటు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. నాన్న మరణించే సమయానికి వాళ్లు ఇంకా చిన్న పిల్లలు. పదేళ్ల నుంచి మా అమ్మ లక్షుమ్మ ఇంటి బాధ్యతలతో పాటు నా చదువును ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒక్క రోజు కూడా ఇంటి వద్ద ఉండకుండా పనులు చేస్తూనే నన్ను కర్నూలు సమీపంలోని తాండ్రపాడు డీఎడ్ చదివించారు. డీఎస్సీ రాయడంతో ఇటీవలనే నాకు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. అమ్మ కష్టాలు నా ఉన్నతికి దారులు వేశాయి. – లక్ష్మీకుళ్లాయమ్మ, కొలిమిగుండ్ల
తల్లిదండ్రుల బాటలో..
నంద్యాల(వ్యవసాయం): తల్లిదండ్రుల ఆశయాలను అందిపుచ్చుకొని నంద్యాల పట్టణంలోని సాయిబాబానగర్‌కు చెందిన హృదయ ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులు రాజేశ్వరి, నాగకృష్ణకుమార్ ఇద్దరూ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. న్యాయవాది వృత్తిలో పేద ప్రజలకు సరైన న్యాయ సలహాలు, న్యాయం జరిగేందుకు కృషి చేయవచ్చు అని తల్లిదండ్రులు చెప్పిన మాటతో వైద్యవృత్తి ఆలోచనను కుమార్తె పక్కనబెట్టారు. న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు.


