జీవితంలో అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేనిది. వారి సహకారంతోనే
నేను ఉన్నత స్థానానికి
ఎదిగాను. నాన్న కోరిక మేరకు డాక్టర్‌ను
అయ్యాను. అమ్మ కోరిక మేరకు కలెక్టర్‌ను
అయ్యాను. డాటర్ ఆఫ్ లక్ష్మణరావు..డాటర్
ఆఫ్ లలిత అనిపించుకోవడం గర్వంగా ఉంది.
ఆడ, మగ అన్న తేడా చూపకుండా ఉన్నత చదువులు చదివించారు. మా తల్లిదండ్రుల స్ఫూర్తితోనే జిల్లాలో బాల్య వివాహాల నివారణకు కృషి చేస్తున్నాను. జిల్లా వెనుకబడడానికి విద్య లేకపోవడమేనని నేను భావిస్తున్నా. అందుకే జిల్లాలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాను. అందులోనూ బాలికల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాను.
– డాక్టర్ ఏ సిరి, కర్నూలు జిల్లా కలెక్టర్
తండ్రితో జిల్లా కలెక్టర్ సిరి


