ఒక ఆడపిల్ల ఆరోగ్యం మన భవిష్యత్ తరాన్ని నిర్ణయిస్తుంది. ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెద్ద మనిషి అయి తల్లి అయ్యే వరకు తన శరీరంలో ఆరోగ్యంలో అనేక కీలక మార్పులు జరుగుతాయి. వారి ఆరోగ్యం చాలా ముఖ్యం. మొదటగా ఆడపిల్లలు నెలసరి మైల సమయంలో మంచి పోషకాహారంతో పాటు శుభ్రత గురించి తగిన జాగ్రతలు తీసుకోవాలి. సరిగా నెలసరి రాకపోయిన అతిగా బరువు పెరిగినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రతి ఆడపిల్ల 10 సంవత్సరాలు నిండాక గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ వేయించుకోవడం అత్యవసరం. గర్భవతులు మంచి పోషకాహారం, ఐరన్, బలం మాత్రలు వాడాలి.
– డాక్టర్ స్నిగ్ధ, హెచ్‌ఓడీ, గైనకాలజీ, జీజీహెచ్, కర్నూలు
●


