అసలేం గుర్తుండటం లేదు! | - | Sakshi
Sakshi News home page

అసలేం గుర్తుండటం లేదు!

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

కర్నూలు(హాస్పిటల్‌): అల్జీమర్స్‌ సాధారణంగా 65 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇటీవల 65 ఏళ్లలోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది మనిషి ఆలోచనా విధానం, ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధితో బాధపడే వారిలో మొదట చైనా, తర్వాత అమెరికా, మూడవ స్థానంలో మన దేశం ఉంది. పురుషుల్లో కంటే సీ్త్రలలోనే ఎక్కువగా ఇది కనిపిస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక విభాగంతో పాటు ప్రైవేటు వైద్యుల వద్దకు మానసిక వ్యాధులతో చికిత్సకు వచ్చే వారిలో 10 శాతానికి పైగా అల్జీమర్స్‌తో బాధపడే వారు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నా రు. సాధారణంగా ఈ వ్యాధితో బాధపడే వారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. ఓపీలో మందులు ఇచ్చి, అవసరమైన కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపిస్తారు. చాలా కొద్దిమందికి మాత్ర మే అడ్మిషన్‌ అవసరమవుతుంది.

అల్జీమర్స్‌కు కారణాలు

మెదడులోని నాడీ కణాలలో అమిలాయిడ్‌ బీటా పైప్టెడ్స్‌ పేరుకుపోవడం, ఇతర నాడీ సంబంధి త మార్పుల వల్ల క్రమంగా నాడీ కణాల పని తీరు దెబ్బతిని వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. అధిక రక్తపోటు, డయాబెటీస్‌, అధిక కొలెస్ట్రాల్‌, పొగాకు అలవాటు, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటి అంశాలు డిమెన్షియా ప్రమాదాన్ని పెంచే అంశాలుగా ఉండవచ్చు. జన్యుపర కారణాలు కూడా కొందరిలో పాత్ర పోషిస్తాయి. కొన్ని రకాల మందులు, నిద్రమాత్రలు, యాంటి కోలినర్జిక్‌ ప్రభావం ఉన్న కొన్ని మందులు, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయి. వైద్యుల సలహా లేకుండా దీర్ఘకాలం మందులు వాడకూడదు.

వ్యాధి లక్షణాలు

వ్యాధి ప్రారంభ దశలో బాగా తెలిసిన ప్రాంతాలు లేదా తెలిసిన పదాలను మరిచిపోవడం, వస్తువులను పోగొట్టుకోవడం లేదా తప్పుగా పెట్టడం, ఇటీవల కలుసుకున్న వారిని కూడా మరిచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జబ్బు తీవ్రత పెరిగే కొద్దీ అప్పుడే జరిగిన సంఘటనలు లేదా వ్యక్తిగత వివరాలు మరిచిపోవడం, గందరగోళానికి గురికావడం, కుటుంబసభ్యులు, బంధువుల ముఖాలను గుర్తించడంలో ఇబ్బంది కలగవచ్చు. మరింత తీవ్రమైన దశలో మూత్ర నియంత్రణ కోల్పోవడం, సాధారణ సంభాషణలకు ప్రతి స్పందించడం తగ్గిపోవడం, రోజువారీ జీవితం కోసం ఇతరులపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది.

డిజిటల్‌ పరికరాలతో మెదడుకు చేటు

ఆధునిక జీవనశైలిలో సాంకేతికతపై మితిమీరి ఆధారపడటం మెదడు సహజ పనితీరును మందగింజేస్తోంది. చిన్న లెక్కలకూ కాలిక్యులేటర్లు, గుర్తుంచుకోవాల్సిన విషయాలకు డిజిటల్‌ రిమైండర్లు వాడటం వల్ల నాడీ వ్యవస్థకు సరైన వ్యాయామం అందడం లేదు. ఫలితంగా జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం క్రమంగా క్షీణించిపోతుంది. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే డిమెన్షియా(మతిమరుపు) నేడు మధ్యవయస్సు వారిలోనూ వేగంగా విస్తరిస్తోంది. కచ్చితంగా మెదడును వాడకపోవడమే గాకుండా డిమెన్షియా, జ్ఞాపకశక్తి క్షీణతకు వయస్సు, జన్యుపరమైన, శారీరక, జీవనశైలి కారకాలు కూడా ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి.

అల్జీమర్స్‌ ఒక ముఖ్యమైన మతిమరుపు వ్యాధి. అయితే చాలా మంది ఇది సహజమేనని

నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో ఈ వ్యాధితో బాధపడే వారు ఒకరుంటే చాలు ఆ కుటుంబం మొత్తం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒంట్లో సత్తువ క్షీణించి, జ్ఞాపకశక్తి నశించిన ఇలాంటి వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీన ప్రపంచ అల్జీమర్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

పెరుగుతున్న అల్జీమర్స్‌

బాధితుల సంఖ్య

వయసు పెరిగే కొద్దీ

బాధితుల సంఖ్య రెట్టింపు

జిల్లాలో ఐదు నుంచి 15 శాతం

మంది వృద్ధుల్లో సమస్య

మందులకు లొంగని మహమ్మారి

నేడు ప్రపంచ అల్జీమర్స్‌

దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement