బేతంచెర్ల: బుగ్గానిపల్లె గ్రామ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల మేరకు నంద్యాల నుంచి బేతంచెర్ల వైపు ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు, బేతంచెర్ల నుంచి నంద్యాల వైపు వెళ్తున్న టమాట లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం ప్రమాదవశాత్తు ఎదురెదురుగా ఢీ కొ న్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రియా జ్ హుస్సేన్ తోపాటు ప్రయాణికులు ఎం.పెండేకల్లు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, మద్దమ్మ, కంబగిరి ఆచారితో పాటు తాటిమాను కొత్తూరు గ్రామానికి చెందిన మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో బేతంచెర్ల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


