కర్నూలు(సెంట్రల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పి.దీప్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 54 ఉద్యోగాల కోసం పేటీఎం, అనంత ప్రాజెక్ట్స్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా పాసైన 18–32 సంవత్సరాల మధ్య ఉన్న యువతీ, యువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న ఉన్న వారు www.ncs.gov.in, employment. zap. gov.in లలో రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు.
పశువులకు నీరు వదలండి
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు సంబంధించి డిస్ట్రీబ్యూటరీ(డీపీ) 67 కింద ఉన్న కుంటకు పశువుల తాగునీటి అవసరాలకు నీటిని వదలాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు ఇంగళదహాళ్ ప్రహ్లాదరెడ్డి కోరారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జీవాలకు నీరు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఎల్లెల్సీలో ప్రవహిస్తున్న నీటిని 67వ డీపీ కింద ఉన్న కుంటకు వదిలితే నీటి ఎద్దడి సమస్య తీరుతుందన్నారు. ఆ నీటిని కేవలం పశువులకు మాత్రమే వాడుకుంటామని తెలిపారు. జిల్లాధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో ఐదుగురు డిబార్
కర్నూలు కల్చరల్: డిగ్రీ రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మంగళవారం చూచిరాతలకు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు రాయలసీమ వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నాగస్వరం నరసింహులు తెలిపారు. మొత్తం 49 పరీక్ష కేంద్రాల్లో 8,372 మంది విద్యార్థులకు 7659 మంది హాజరు కాగా 708 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు డిగ్రీ కళాశాల, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎమ్మిగనూరు సిద్ధార్థ డిగ్రీ కళాశాల, చాగలమర్రి ఎస్‌వీ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ కళాశాల కేంద్రాల్లో ఒక్కొరు చొప్పున మొత్తం ఐదుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు. బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలకు 4,865 మంది విద్యార్థులకు 4,597 మంది పరీక్షలకు హాజరు కాగా 268 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
లా పరీక్షలకు
34 మంది గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న లా రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల్లో మంగళవారం 31 మంది గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నాగస్వరం నరసింహులు పేర్కొన్నారు. రెండు కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 426 మంది విద్యార్థులకు 395 మంది హాజరు కాగా 93 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు.
బుడగ జంగాల కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి
నంద్యాల: పట్టణంలోని బుడగ జంగాల కాలనీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం ఆమె కాలనీని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయాలని, రోడ్లు, డ్రైనే జీ ఏర్పాటు చేయాలని, శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కాలనీవాసులు కలెక్టర్‌ను కోరా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బుడగజంగాల కాలనీలో వెంటనే అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించాలని అధికారులు ఆదేశించా రు. రోడ్లు, డ్రైనేజీ, శ్మశాన వాటిక వంటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 104 మంది విద్యార్థులతో అద్దె భవనంలో నడుస్తున్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను పరిశీలి ంచి ఇరుకు గదుల్లో ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
రోడ్డు ప్రమాదంలో
గుర్తు తెలియని వ్యక్తి మృతి
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదానికి గురై రెండు రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి కోలుకోలేక మృతి చెందినట్లు టూటౌన్ సీఐ అస్రార్‌బాషా తెలిపారు. వ్యక్తి వయస్సు 35 నుంచి 45 మధ్య ఉంటుందని, కాకి రంగు చొక్కా ధరించి ఉన్నాడని, ఎవరికై నా సమాచారం తెలిస్తే టూటౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
వివాహిత బలవన్మరణం
డోన్ టౌన్: మండల పరిధిలోని కొచ్చెర్వు గ్రామంలో రాజేశ్వరి (27)అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూరల్ ఎస్‌ఐ మమత తెలిపిన వివరాల మేరకు.. రాజేశ్వరికి సోంపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొద్ది నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కొచ్చెర్వు గ్రామంలోని పుట్టింటికి వచ్చారు. వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


