పత్తికొండ రూరల్: తాగునీటి సమస్య తీర్చాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబును అటికెలగుండు గ్రామస్తులు కోరారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. రెండేళ్ల పాలనలో చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తుండగా గ్రామంలో తాగునీటి సమస్యను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. బండగట్టు పథకం నీరు నిలిచిపోవడంతో గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తిందని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ ఏమీ చేయలేక గ్రామస్తులతో పాటు బిందె ఎత్తి నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ కార్యకర్తల ఇళ్లకు మాత్రమే వెళ్లి, గ్రామంలో కొన్ని కాలనీల్లోనే తిరిగి వెళ్లిపోయారు.


